Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది.ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా పోలింగ్‌ ముగిసే సమయానికి 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరగుతోంది. సాయంత్రం 4 వరకు పోలింగ్‌ కొనసాగుతుంది.పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌క్యాస్టింగ్‌ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 96.69 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలో 87.73 శాతం పోలింగ్‌, నల్లగొండ జిల్లాలో 83.63 శాతం పోలింగ్‌, ఖమ్మం జిల్లాలో 79.95 శాతం, కరీంనగర్‌ జిల్లాలో 72.08 శాతం పోలింగ్‌ నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img