Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రంగారెడ్డిలో 2 స్థానాలు, వరంగల్‌లో ఒక స్థానం.. నిజామాబాద్‌లో ఒక స్థానం, మహబూబ్‌నగర్‌లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌లో 2 స్థానాలు, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహిస్తారు. డిసెంబర్‌ 14న కౌంటింగ్‌ చేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img