Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

మునుగోడులో గెలుపు కాంగ్రెస్‌దే ! : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రాజగోపాల్‌ రెడ్డి. ఆయన రాజీనామాను స్పీకర్‌ అమోదించగా త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని..మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు. మూడేండ్లుగా రాజగోపాల్‌రెడ్డి చేసిన ఉద్యమమేంటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ప్రజలు ఎలా చూస్తారనేది చూడాలన్నారు.సీఎల్పీనేత భట్టివిక్రమార్క.. ధర్మరాజు అయితే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడని, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును అర్జునుడిగా అభివర్ణించారు. రాజగోపాల్‌ రెడ్డిని కర్ణుడితో పోల్చారు జీవన్‌ రెడ్డి. ఎమ్మెల్యేగా ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ రాజగోపాల్‌ రెడ్డిని వద్దని చెప్పిందా అని నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img