Monday, September 26, 2022
Monday, September 26, 2022

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోను : కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

తాను మునుగోడు ఎన్నిక ప్రచారానికి వెళ్లేది లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత చండూరులో నిర్వహించిన పార్టీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని ఆయన ఆరోపించారు. పార్టీ సభకు ఆహ్వానం అందకపోగా… సభలో సొంత పార్టీ నేతలతోనే తనను తిట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్‌ కూడా విడుదల కాకముందే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేతులు ఎత్తేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఓ రాజకీయ పార్టీగా, రాజకీయ నేతగా ఏ ఎన్నిక అయినా గెలుస్తామనే ధీమాతోనే ముందుకెళ్లాలన్న వెంకట్‌ రెడ్డి… ఎన్నికకు ముందే చేతులు ఎత్తేయడం ఏమిటంటూ విమర్శించారు. చండూరు సభలో తనను తిట్టించిన రేవంత్‌ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img