Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

మునుగోడు చేరుకున్న సీఎం కేసీఆర్‌

ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ జెండా ఎగుర వేశారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్‌ మునుగోడుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకగా.. అభివాదం చేస్తూ సభ వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం సభకు మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు మునుగోడులో దీనపరిస్థితులు ఉండేవన్నారు. ఎడారిలాంటి జిల్లాను సీఎం సస్యశ్యామలంగా మార్చారన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ రక్కసిని సీఎం పారద్రోలారన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లినా నల్గొండ జిల్లా గురించి చెప్పేవారన్నారు. నల్గొండ జిల్లాకు ఏదైనా చేస్తే ముందు ఫ్లోరైడ్‌ నివారణే అని సీఎం చెప్పారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img