Monday, December 5, 2022
Monday, December 5, 2022

మునుగోడు టీఆర్‌ఎస్‌దే…

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టీఆర్‌ఎస్‌ పార్టీనేనని తేల్చి చెప్పారు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి. నల్గొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా%ౌౌ%ఒక వ్యక్తి స్వార్ధం కోసం వచ్చిన ఎన్నికలు ఇవని అన్నారు. మునుగోడు ప్రజలు మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలన్న, అభివృద్ధి జరగాలన్న అది టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని..దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశరు. కేంద్ర మంత్రులంతా మునుగోడులోనే తిరుగుతున్నారని..విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ని బెదిరించేందుకు ఈడీ, సీబీఐని వాడుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. మునుగోడులో మతతత్వ రాజకీయాలు చెల్లవని..ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img