Monday, February 6, 2023
Monday, February 6, 2023

ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువ

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజయదశమి ప్రసంగం అబద్ధాలు, సగం సత్యాలతో నిండి ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ముస్లిములు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని పునరావృతం చేశారని, కాని ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందనిీ చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్‌ వ్యాఖ్యలను ఒవైసీ విమర్శించారు. కశ్మీర్‌లో ప్రజలు ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతున్నారని భగవత్‌ నివేదించిన వ్యాఖ్యలపై ఈ సంవత్సరంలో జరిగిన పౌరుల హత్యలను ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు, సామూహిక నిర్బంధాలతో కశ్మీరు మారిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img