Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

మూసీ నదిలో మొసలి

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ వద్ద మూసీలో మొసలి కలకం సృష్టించింది. నగరంలో నిన్న కురిసిన వర్షానికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ గేట్లు ఎత్తడంతో మూసీ వరదలో మొసలి కొట్టుకువచ్చినట్లు తెలుస్తోంది. మొసలిని గమనించిన స్థానికులు.. జూ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. సైన్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో కిస్మత్‌పూర్‌లో రెండు మొసళ్ల కళేబరాలను అధికారులు గుర్తించారు. ఇక ఈ మధ్యాహ్నం తర్వాత మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img