Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

మృగశిర కార్తె చేపల కోసం మార్కెట్ల వద్ద బారులు

మృగశిర కార్తె తొలిరోజున ఇంటింటా చేపల పులుసు మరగాల్సిందే. మృగశిర కార్త్తె మొదటిరోజు చేపలు తప్పకుండా తినాలని ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున చేపల కొనుగోలుకు చెరువుల వద్ద, విక్రయ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, రైతుబజార్లలో చేపల కోసం జనాలు క్యూకడుతున్నారు. కాగా, కార్తెను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్దఎత్తున చేపలు తెప్పించి అమ్ముతున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌కు కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట, నిజామాబాద్‌ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్‌లోని ఆకునీడు, భీమవరం నుంచి పెద్దఎత్తున చేపలు దిగుమతి అయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img