Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

మెడికో ప్రీతి కేసులో వెలుగులోకి రిమాండ్‌ రిపోర్టు

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌ ధరావత్‌ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌ రిమాండ్‌ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సైఫ్‌ ఫోన్‌ నుంచి 17 వాట్సాప్‌ చాట్స్‌ను పోలీసులు పరిశీలించినట్లు తెలిసింది. అందులో అనుషా, భార్గవ్‌, ఎల్‌డీడీంనాక్‌ అవుట్స్‌ గ్రూప్‌ చాట్స్‌ను పోలీసులు విశ్లేషించారు. అందులో ముఖ్యమైన విషయాలను గుర్తించారు. అనస్థీషియా డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌గా ఉండేవాడు. ఇదే డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రీతిని సైఫ్‌ సూపర్‌వైజ్‌ చేసేవాడు. రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సైఫ్‌ కోపం పెంచుకున్నుట్లు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడైంది.డిసెంబర్‌లో జరిగిన ఓ యాక్సిడెంట్‌ కేసులో సైఫ్‌ మెడికో ప్రీతిని గైడ్‌ చేశాడు. ఆ కేసులో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా.. ఆమె రాసిన రిపోర్టును వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేసిన సైఫ్‌ హేళనగా మేసేజ్‌ పెట్టాడు. ప్రీతికి రిజర్వేషన్‌లో ఫ్రీ సీట్‌ వచ్చిందంటూ ఆమెను అవమానపరిచాడు. దీంతో ‘నాతో ఏమైనా ప్రాబ్లమా ?..ప్రాబ్లమ్‌ ఉంటే హెచ్‌వోడీకి చెప్పు’ అంటూ ప్రీతి సైఫ్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ప్రీతిపై కోపం పెంచుకున్న సైఫ్‌.. ఆమెను వేధించాలని భార్గవ్‌కు చెప్పాడు. ప్రీతికి ఆర్‌ఐసీయూలో రెస్ట్‌ లేకుండా డ్యూటీ వేయాలని సైఫ్‌ భార్గవ్‌కు సూచించాడు. వారి టార్చర్‌ తట్టుకోలేని ప్రీతి గత నెల 21న హెచ్‌వోడీ నాగార్జునకు ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్లు మురళి, ప్రియదర్శిని, శ్రీకళ సమక్షంలో సైఫ్‌, ప్రీతిలు ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాతి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడిరచారు.సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ప్రీతి పాయిజన్‌ ఇంజక్షన్‌ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిరది. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి గత నెల 26న కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు. ఆమె మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రీతిని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా..సైఫ్‌పై వరంగల్‌ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసారు. గత నెల 24న అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం అతను ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. వేధింపుల నేపథ్యంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సైఫ్‌ను సస్పెండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img