Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

మెరుగ్గా.. కైకాల ఆరోగ్యం

వదంతులు నమ్మొద్దు : కైకాల సత్యనారాయణ కుమార్తె
టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిరది. ఆయన స్పృహలోకి వచ్చినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు. వెల్లడిరచారు. రక్తపోటు తగ్గిందని.. కిడ్నీ పనితీరు మెరుగుపడిరదని పేర్కొన్నారు. వెంటిలేటర్‌ మద్దతును నెమ్మదిగా తగ్గిస్తున్నామన్నారు. త్వరలో మరింత ఆరోగ్యంగా మారుతారని హెల్త్‌ బులిటన్‌లో పేర్కొన్నారు.కాగా కౖకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఆయన కూతురు రమాదేవి స్పందించారు. మీడియాకు ఆడియో టేపును పంపించారు. వేగంగా కోలుకుంటున్నారని.. ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు. అందరితో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందక్కర్లేదని.. దయచేసి అనవసర వార్తలను ప్రచారం చేయవద్దని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img