Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే..సీఎంకు వణుకు

కాంగ్రెస్‌ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందని.. మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే ఆయన గజగజ వణికిపోతున్నాడని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడన్నారని అన్నారు. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు తన ఇంటి వద్ద దృశ్యమే ఉదాహరణ అని అన్నారు. ప్రజాగ్రహం పెల్లుబికిన నాడు నీ ప్రగతి భవన్‌లు, ఫాంహౌస్‌లు బద్ధలైపోతాయని అన్నారు. ‘ఇదేం సంస్కారం కేసీఆర్‌ ?.. అర్థరాత్రి నుంచి పోలీసులతో ఇంటిని ముట్టడిరచడం..అనుమతి లేకుండా ఇంటి లోపలికి జొరబడటం..పరామర్శలకు కూడా వెళ్లకుండా నిర్భందించడం..ఇదేనా కేసీఆర్‌ నీ పాలనా సంస్కారం. రైతులు చస్తుంటే పరామర్శించడం పాపమా..? మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్‌ ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా!? పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు కానీ పేదరైతు కుటుంబాన్ని పరామర్శించే తీరకలేదా? నువ్వు ఎలాగూ వెళ్లవు..మేం పరామర్శిస్తుంటే నీకొచ్చిన నొప్పేంటి?’’ అంటూ మండిపడ్డారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి వెళ్లకుండా జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు. దీనిపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img