స్వచ్ఛ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ కొత్తగా సమకూర్చిన 250 స్వచ్ఛ ఆటోలను సనత్‌నగర్‌లోని జీహెచ్ఎంసీ వెల్ఫేర్ గ్రౌండ్లో తలసానితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. . గ్రేటర్లో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే నగరంలో చెత్త సేకరణకు 3,150 స్వచ్ఛ టిప్పర్లు అందుబాటులో ఉండగా… మరో 1100 ఆటోలను జీహెచ్ఎంసీ తీసుకురానుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి నగరవాసుల తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో నగరంలో 3,500 మెట్రిల్ టన్నుల చెత్త సేకరించేవారని చెప్పారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ ద్వారా ఇప్పుడు నగరంలో 6,500 టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. చెత్తను నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ దక్షిణ భారతంలోని మన హైదరాబాద్‌లో పెద్దదని తెలిపారు. రాబోయే రోజుల్లో మొత్తం చెత్తను రీ సైకిల్ చేసేలా ప్లాంట్ తీసుకోస్తామని అన్నారు. శానిటేషన్ సిబ్బందికి అడగకున్న సీఎం కేసీఆర్ మూడు సార్లు జీతాలు పెంచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. స్వచ్ఛతలో హైదరాబాద్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పారు. నగరంలో పార్కులు, రోడ్లు, బస్ షల్టర్లు సుందరంగా మారాయన్నారు.నగరవాసులు స్వచ్ఛ ఆటోలను ఉపయోగించుకోవాలని సూచించారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.