Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి : మంత్రి తలసాని

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా గురువారం సికింద్రాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ప్రభావం నిత్యావసరాలపై పడుతుందని తెలిపారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పేదలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img