Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

రంజాన్‌కు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు : తలసాని

రంజాన్‌కు పండగ కోసం ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. రంజాన్‌ పండుగ ఏర్పాట్ల పై డిఎస్‌ఎస్‌ భవన్‌ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అన్ని వర్గాల పండగలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్‌ ను ఘనంగా జరుపుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నిరుపేదలు సైతం పండుగ ను సంతోషంగా జరుపుకోవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ఆలోచన అన్నారు. ఈమేరకు నూతన దుస్తుల గిఫ్ట్‌ ప్యాకెట్‌ లను కూడా ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే మసీదుల్లో ప్రతి సంవత్సరం ఇఫ్తార్‌ విందులకు సైతం ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img