Monday, October 3, 2022
Monday, October 3, 2022

రవితేజను 6 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు

ప్రముఖ నటుడు రవితేజ, ఆయనతో పాటు ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరు గంటలపాటు ఈడీ అధికారులు వీరిని ప్రశ్నించారు. మహమ్మద్‌ జిషాన్‌ అలీఖాన్‌ అలియాస్‌ జాక్‌ను కూడా అధికారులు విచారించారు. ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న జిషాన్‌ 2017లో కొకైన్‌ సరఫరా చేస్తూ ఎక్సైజ్‌ శాఖకు దొరికాడు. జిషాన్‌తో పాటు బెర్నాడ్‌ అలియాస్‌ విలియమ్స్‌ను ఎక్సైజ్‌ శాఖ అరెస్ట్‌ చేసింది. ఎఫ్‌ ప్రొడక్షన్‌కు జిషాన్‌ గతంలో భాగస్వామిగా వ్యవహరించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img