ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ
కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు కారణమన్న ఆరోపణలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. తన రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సూసైడ్ చేసుకోవడం తనకు బాధగా ఉందన్నారు. చట్టం, న్యాయంపై నమ్మకం ఉన్న తాను దర్యాప్తునకు అన్ని విధాల సహకరిస్తానన్నారు. తన కొడుకునూ ఇన్వెస్టిగేషన్‌కు సహకరించేలా బాధ్యత తీసుకుంటానన్నారు. కేసులో నిజా నిజాలు తేలేదాకా కొడుకు రాఘవేంద్రను పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గ పనులకు దూరంగా ఉంచుతానని హామీ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా నాతోపాటు టీఆర్‌ఎస్‌పై ఆరోపపణలు చేస్తున్నారు. పార్టీలు, వ్యక్తుల ఆరోపణలు నేను పట్టించుకోను అని లేఖలో పేర్కొన్నారు.