Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు.. రవిచంద్రతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు కే. కేశవరావు, నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఎంపీ రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన బండ ప్రకాశ్‌ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానంలో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img