Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

రానున్న మూడు రోజులు మరింత పెరగనున్న ఎండ తీవ్రత

తెలుగురాష్ట్రాల్లో ఎండలు మరింత పెరుగుతున్నాయి. మరో మూడు రోజులు రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రాగల మూడు రోజులు సాదారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపపారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఒడిషా నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి సముద్రం మట్టం నుంచి .9 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img