Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడిరచింది. వర్షాల వల్ల ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచనున్నట్లు వాతావరణ శాఖ అధికారి పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు రోజులు అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్‌, అత్యల్పంగా 29 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img