Friday, December 1, 2023
Friday, December 1, 2023

రామప్ప ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక నిర్వహణ కమిటీ


రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలను చేపట్టిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రామప్ప ప్రాంత పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీని అదేవిధంగా స్థానిక స్థాయిలో పాలంపేట్‌ ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.గురువారం రవీంద్రభారతిలోని మంత్రి మీడియాతో మాట్లాడారు. రామప్పకు త్వరలోనే యునెస్కో గుర్తింపు లభించనున్నట్లు తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు చివరి దశకు చేరిందన్నారు.తెలంగాణ వారసత్వ శాఖ రామప్ప పరిసర ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాల పరిక్షణ ప్రణాళిక (సిఎంపి), పర్యాటక అభివృద్ధి వంటి అంశాల సక్రమ అమలు కోసం రాష్ట్రస్ధాయిలో వివిధ శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటుచేసిందని అన్నారు.దీనిలో కేంద్ర పురావస్తుశాఖ, దేవాదాయశాఖ, నగర ప్రణాళిక, నీటి పారుదల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని అన్నారు. కమిటీకి అధ్యక్షుడిగా ప్రభుత్వ పర్యాటక కార్యదర్శి వ్యవహరిస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img