Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి..

మిషన్‌ భగీరథ అధికారులకు సూచించిన మంత్రి ఎర్రబెల్లి
ఎండాకాలంలో ఎక్కడా మంచినీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. అన్ని రిజర్వాయర్లు నిండిఉండేలా ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా సర్వ సన్నద్ధంగా ఉండి, సమన్వయంతో పనిచేయాలన్నారు. రానున్న ఎండాకాలం నేపథ్యంలో మంచినీటి సరఫరాపై హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని మిషన్‌ భగీరథ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీటి సరఫరాపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.ఎండాకాలంలో కూడా నిర్ధేశిత నీటిని ప్రజలకు నాణ్యంగా అందించాలన్నారు. ఎక్కడైనా కరెంటు సమస్యలు వచ్చినప్పటికీ నీటి సరఫరా ఆగొద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని తెలిపారు. పంపుల మెయింటెనెన్స్‌ సరిగా చేయాలని, పైప్‌లైన్‌ లీకేజీలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, అంగన్‌ వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీరు సక్రమంగా అందాలని చెప్పారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, నీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img