Monday, February 6, 2023
Monday, February 6, 2023

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం..అయినా జాగ్రత్తలు పాటించాలి


: డీహెచ్‌ శ్రీనివాసరావు
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. అయితే మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, పండుగలు.. విందులు.. షాపింగ్‌ సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యలను సంప్రదించాలన్నారు. డిసెంబర్‌ వరకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరని, ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని సూచించారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.01కోట్ల మందికి కనీసం ఒక డోసు కొవిడ్‌ టీకా ఇచ్చామని, 38శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img