Monday, January 30, 2023
Monday, January 30, 2023

రాష్ట్రంలో కాదు..దిల్లీలో ధర్నాలు చేయాలి..

బీజేపీ ధర్నాలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మండిపాటు

తెలంగాణలో నిరంతరం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు కోసం నిన్నటి వరకు 3,550 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచామని తెలిపారు. అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై కనీస అవగాహన లేకుండా బీజేపీ ధర్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు.ధాన్యం సేకరించిన వెంటనే, జాప్యం లేకుండా రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేయాలి. కనీస సమాచారం లేని వారు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతులే మార్కెట్ల వద్దకు ధాన్యం తరలిస్తుంటే.. తెలంగాణలో మాత్రం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కాదు బీజేపీ దిల్లీలో ధర్నాలు చేయలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img