తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు.
ఏ జిల్లాలొ ఎన్ని..
నారాయణ పేట జిల్లా.. రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ , కొత్తపల్లె మండలాలు ఏర్పాటయ్యాయి. ఇక, కొత్తగా వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ మండలం ఏర్పాటైంది. మహబూబ్ నగర్ జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల మండలం ఏర్పాట్లు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో పాటుగా..నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో..ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు ఏర్పాటయ్యాయి. జామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిథిలో, సాలూర మండలం ఏర్పాటు కానుంది. మహబూబాబాద్ జిల్లా..రెవిన్యూ డివిజన్ పరిథిలో..సీరోల్ మండలం ఏర్పాటైంది. నల్లగొండ జిల్లా..రెవిన్యూ డివిజన్ పరిథిలో…గట్టుప్పల్ మండలం కొత్తగా ఏర్పాటు కానుంది. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకర్గం పరిధిలోకి వస్తుంది. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో…నిజాం పేట్ మండలం ఏర్పాటైంది.