Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముగిసింది

రాష్ట్రంలో కొవిడ్‌ చాలావరకు అదుపులోకి వచ్చిందని, సెకండ్‌వేవ్‌ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు జీ. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని, వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జ్వరం వస్తే కొవిడ్‌ కారణంగానే సంక్రమించిందని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200కుపైగా డెంగీ కేసులు వచ్చినట్లు తెలిపారు.హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం మందికి తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. 34 శాతం మందికి రెండు డోసులు వేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img