Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాలి


స్పీకర్‌ పోచారం
దేశాన్ని ఎక్కువ కాలం నుంచి పరిపాలిస్తున్న పార్టీలు అభివృద్ధి చేయలేదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రతిపక్షాలకు హితవు పలికారు. కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.బీర్కూరు మండలంలో రూ.54 లక్షలతో నిర్మించే ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులకు, బెడ్‌రూం ఇండ్లకు, రూ. 20 లక్షలతో సిసీ రోడ్లు, డ్రైనేజీలు, బత్తిన సంఘం భవనం, పద్మశాలీ సంఘం భవనానికి, అలాగే బీర్కూరు తండాలో నూతనంగా నిర్మించే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు, రూ.5 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనం ప్రహరీ గోడకు శాసన సభాపతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ, నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లును మంజూరు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img