కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. ఇన్ని రోజుల సెలవుల అనంతరం పాఠశాలలను పున:ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలుచేస్తున్నారు. అయితే, సీబీఎస్‌ఈ పాఠశాలలు మాత్రం ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. మరికొన్ని పాఠశాలలు కొన్ని రోజుల పాటు ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని నిర్ణయించాయి. మరోవైపు క్లాసులను నిర్వహించే క్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.