రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో చాలా చోట్లా మొస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. అదేవిధంగా రాజధాని నగరం హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నదని హెచ్చరించింది. నగరంలో మూడు రోజులపాటు అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రహదారుపై ఎక్కడ నీరు నిలువకుండా చూడాలని సూచించారు. కాగా, కాస్త ఆలస్యమైనప్పటికీ రాష్ట్రంలోకి రుతుపవనాలు సోమవారం ప్రవేశించాయి. దీంతో జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. హదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయింది.