రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్) శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉందని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 4.64శాతం, మేడ్చల్‌లో 3.76శాతం, నారాయణపేటలో 8.88శాతం, కామారెడ్డిలో 8.32 శాతం పాజిటివిటీ రేటు నమోదైనట్లు డీహెచ్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.