Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రాష్ట్రంలో పెరిగిన చలి

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. చలితీవ్రతకు జనం వణుకుతున్నారు. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా వాహనదారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఈశాన్య భారత నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. సాయంత్రం పూట గాలుల తీవ్రత పెరుగుతున్నది. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే బేలా, సిర్పూర్‌ (యూ)లో 3.8, అర్లి(టీ) 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వాంకిడిలో 4.9, జైనథ్‌లో వాంకిడి లో 4.9, చాప్రాలలో 5.1, సోనాలా లో 5.2, బజార్‌హత్నూర్‌లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్‌ డీపీఎస్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img