Thursday, March 30, 2023
Thursday, March 30, 2023

తెలంగాణలో మాస్క్‌ తప్పనిసరి…

దేశ రాజధాని ఢల్లీి సహా పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఏమాత్రం పెరుగుదల లేకున్నా కూడా ముందు జాగ్రత్త చర్యగా మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని చెప్పిన తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌..మాస్క్‌ లేకుంటే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ. ప్రజల్లో 93 శాతం యాంటీబాడీస్‌ను గుర్తించాం. థర్డ్‌ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం. అయినా కూడా ఫంక్షన్లు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. మాస్క్‌ తప్పనిసరిగా వినియోగించాలి. మాస్క్‌ లేకుంటే రూ.1,000 జరిమానా విధిస్తాం అని ఆయన ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img