Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ ప్రకారం, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడిరది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో నిర్మల్‌ జిల్లాలో వాన దంచికొట్టింది. ఆ జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 245 మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జలాశయాలకు వరద పోటెత్తింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img