కేఆర్‌ఎంబీకి ఈఎన్‌సీ లేఖ
కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతివ్వాలని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ను తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ కోరారు. గురువారం ఆయన కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖలు రాశారు. రాష్ట్రానికి అదనంగా కృష్ణా జలాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సాగర్ ఎడమ కాలువల పథకాలపై ఏపీకి అభ్యంతరాలు అక్కర్లేదన్నారు. ప్రతిపాదించిన 13 ఎత్తిపోతలపై అభ్యంతరాలు అవసరం లేదని ఈఎన్‌సీ స్పష్టంచేశారు.