Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రానికి వంత పాడే ధోరణిని మానుకోవాలి : ఎర్రబెల్లి

రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు లేకుండా కేంద్రానికి వంత పాడే ధోరణిని మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలన్నారు రైతు బంధు సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ఢల్లీిలో తనను కలిసిన తెలంగాణ బృందంతో ‘‘మీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు నూకలు (బ్రోకెన్‌ రైస్‌) తినడం అలవాటు చేయండి. అంతేగానీ మేం మాత్రం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయలేం’’ అంటూ తెలంగాణ ప్రజలను అవమానించేలా, అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img