Friday, October 7, 2022
Friday, October 7, 2022

రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ : హరీశ్‌ రావు

రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్‌ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తుందని మంత్రి విమర్శించారు. కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడిరదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img