Monday, February 6, 2023
Monday, February 6, 2023

రెండు రాష్ట్రాలను కలపాలని చూస్తున్నారు.. మంత్రి గంగుల

తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్‌ బిడ్డ వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందని, పవన్‌ కల్యాణ్‌, కేఏ పాల్‌ కూడా వచ్చారని, తెలంగాణ సంపదపై వీరంతా కన్నేశారని మంత్రి గంగుల కమలాకర్‌ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ఎంటరయ్యాడని, పాత బిడ్డల్లారా రండి అంటున్నడని, డిఫరెంట్‌ వేషాల్లో వీళ్లంతా వచ్చినా అందరు ఒకటేనన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీరి ఎజెండా అన్నారు. మళ్లీ 1956 నవంబర్‌ 1 గుర్తుకు తెస్తున్నారని, ఆ ప్రయత్నంలో భాగమే చంద్రబాబు ఎంట్రీ అన్నారు. మీ మూలాలు ఎక్కడ? ఏపీ మూలాలున్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని అని ధ్వజమెత్తారు. రెండు రాష్ట్రాలు జూన్‌ 2నే ఏర్పడినా చంద్రబాబు ఆరోజు ప్రమాణం చేయలేదని గుర్తు చేశారు. ఖమ్మం నుంచి ఏడు మండలాలు కలిపేదాకా ప్రమాణం చేయనన్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. సీలేరు పవర్‌ ప్లాంట్‌ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వీరందరి వెనక బీజేపీ ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img