Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

రెండోసారి శాసనమండలి చైర్మన్‌ పదవి చేపట్టిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్‌గా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్‌ రావడంతో.. గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మన్‌ సీటులో ఆశీనులైన గుత్తా సుఖేందర్‌ రెడ్డికి మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img