Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

రేపు తెలంగాణలో వాక్సినేషన్‌కు హాలీడే

దీపావళి పండగ సందర్భంగా తెలంగాణలో రేపు (నవంబర్‌ 4వ తేదీన) వాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఎల్లుండి (నవంబర్‌ 5) శుక్రవారం నుంచి మళ్ళీ యధావిధిగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా దీపావళి పండగ సందర్భంగా దీపాలను, బాణాసంచా వెలిగించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చేతులకు శానిటైజర్లను ఉపయోగించవద్దని సూచించారు. శానిటైజర్లలోని ఆల్కహాల్‌ కు మండే గుణం ఉంటుంది కనుక దీపావళిరోజున దీపాలు వేగిస్తున్న సమయంలో క్రాకర్స్‌ కలుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img