Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

రేపు వాసాలమర్రికి కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రికి బుధవారం వెళ్లనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్‌..ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు.వాసాలమర్రిలో రైతు వేదిక భవనంలో గ్రామ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశమవుతారు. గ్రామ అభివృద్ధిపై గ్రామ కమిటీల నుంచి సీఎం వివరాలు తెలుసుకోనున్నారు. రైతు వేదిక సమావేశం అనంతరం ఎస్సీ కాలనీలో కేసీఆర్‌ పర్యటిస్తారు. తర్వాత సర్పంచ్‌ ఇంట్లో భోజనం చేసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img