Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

రేపు సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన… ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జాతీయ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ సీఎం కెేసీఆర్‌ వివిధ జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్న కెసిఆర్‌ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని, స్వామి వారికి ఒక కేజీ 16 తులాల బంగారాన్ని సమర్పించారు. ఇక రేపు వరంగల్‌ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. వరంగల్‌ జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రతిభ క్యాన్సర్‌ రిలీఫ్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, తో పాటు మెడికల్‌ కళాశాలను ప్రారంభించనున్నారు. కేసీఆర్‌ వరంగల్‌ జిల్లా పర్యటన.. షెడ్యూల్‌ ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ములుగు రోడ్డు లో ఉన్న ప్రతిమ హాస్పిటల్‌కు చేరుకుంటారు. ప్రతిమ రిలీఫ్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, మెడికల్‌ కళాశాలను ప్రారంభిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ కు తిరుగు ప్రయాణం అవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img