Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

నల్లజెండాలను ఎగురవేసి రైతులకు సంఫీుభావం తెలపాలి

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తన నివాసంపై నల్లజెండాను ఎగురవేశారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నల్లజెండాలను ఎగురవేసి రైతులకు సంఫీుభావం తెలపాలని కోరారు. తెలంగాణ రైతన్నలు పండిరచిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్షను వీడనాడాలని డిమాండ్‌ చేశారు. వడ్లు కొనేదాకా రైతుల తరపున కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఊరూరా ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేలని, గ్రామ కూడళ్లలో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసి ఢల్లీి వరకు ఈ నిరసన సెగలు తాకేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img