Monday, January 30, 2023
Monday, January 30, 2023

రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసు..23 మంది అరెస్టు

నల్గొండ జిల్లాలో రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును పోలీసులు ఛేదించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎఎస్పీ కేసు వివరాలను వెల్లడిరచారు. జిల్లాలోని గుర్రంపోడు, పెద్ద అడిశర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, చండూర్‌ మండలాల పరిధిలో రైతాంగానికి .రైతు బంధు పథకంలో భాగంగా చెక్కులు పంపిణీ చేశారు. కొందరు రెవెన్యూ అధికారులు, దళారీలు, బ్యాంకు అధికారులతో కుమ్మకై అక్రమంగా 547 చెక్కుల ద్వారా రూ. 61,50,460 నగదును అక్రమంగా డ్రా చేశారని అదనపు ఎస్పీ నర్మద వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో అయిదు మండలాల పరిధిలో అయిదు క్రిమినల్‌ కేసులను నమోదు చేసి 23 మందిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img