రైతులు ఆత్మహత్యలు కనపడవు కానీ.. రైతు బంధు కోసం వారోత్సవాలా? అని ౖ వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు.. రైతుల చావులు కండ్లకు కనపడవు దొరకి. దొరగారి మెప్పుకోసం రైతు బంధు వారోత్సవాలా? మీరు జరుపుకొనేది రైతు బంధు వారోత్సవాలు కాదు, రైతు చావుల వారోత్సవాలు’’ అని షర్మిల విమర్శించారు.