Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

రైతుల ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్ర చేస్తోంది

ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
తెలంగాణ రైతులు పండిరచిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటులో ప్రకటన చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలోని మంత్రులు అబద్ధాలమీదనే బతుకున్నారని అన్నారు. తెలంగాణ రైతుల ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. రైతులు పండిరచిన పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలతో తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రైతులు, ప్రజల పట్ల పూర్తిగా ప్రధాని వివక్ష చూపుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అనేక కార్యక్రమాలతో నీళ్లు రావడంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయని, ప్రభుత్వం రైతుబంధు ఇస్తుండటంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ధాన్యం సేకరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ధాన్యం కొనేవరకు పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గోరి కట్టడం ఖాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img