Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతుల పేరిట రాజకీయం చేయొద్దు..మంత్రి నిరంజన్‌ రెడ్డి

రైతుల పేరిట రాజకీయం చేయొద్దు అని ప్రతిపక్షాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. వర్షాలపై ప్రభుత్వం నాలుగు రోజుల ముందే ప్రజలను, రైతులను అప్రమత్తం చేస్తుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించామని తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు చెప్పామని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం చేసే దీక్షలను రైతులు గమనిస్తారు. ఈ ప్రభుత్వం రైతులు, సాగుకు తొలి ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్తే కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించలేదు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌తో రైతుల్లో విశ్వాసం పెరిగింది అని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img