దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్మించాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేస్తున్నామని చెప్పారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో కేటీఆర్ రైతు వేదికను ప్రారంభించి ప్రసంగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. యువ ఐఏఎస్‌లకు ఈ విధానాలు పాఠాలుగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు మద్దతుగా ముందుకు వెళ్తుందన్నారు.