Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

రైతు సమస్యలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు : పొన్నాల లక్ష్మయ్య

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. దిల్లీ వెళ్లిన కేసీఆర్‌ ప్రధాని మోదీ ఇంటి వద్ద ఎందుకు ధర్నా చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం తెలంగాణకు అవమానమన్నారు. దిల్లీకి వెళ్లి తాడో పేడో తేల్చుకుంటానని మాట్లాడిన ఆయన అక్కడ ఏం జరిగిందో ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img