Friday, February 3, 2023
Friday, February 3, 2023

రోడ్డు పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి : మంత్రి వేముల

నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో రూ.8.50 కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు. నేడు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆ పనులను పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మెయిన్‌ రోడ్‌ నాలుగు వరుసలు వెడల్పు, డివైడర్‌ సెంట్రల్‌ లైటింగ్‌, గ్రామ పంచాయతీ డబుల్‌ లైన్‌ రోడ్‌ పనులతో పాటు రూ.90 లక్షలతో చేపట్టిన అంబేద్కర్‌ రోడ్‌ పనులను పరిశీలించారు. రోడ్డు పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img