Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి

అధికారులకు సీఎస్‌ ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లు, అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్లతో బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటి పారుదల , విద్యుత్‌ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని సీఎస్‌ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్‌ క్వార్టర్స్‌లోనే ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img